Tuesday, 5 November 2013

"సృజన - సకల కళా సమ్మేళనం" బ్లాగ్ పత్రిక

నమస్కారం


బ్లాగ్ ప్రపంచంలో ని సభ్యులకు అలాగే తెలుగు భాషాభిమానులకు కళాకారులకు ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. 

బ్లాగ్ ప్రపంచం లో ని పత్రిక ని ప్రవేశ పెట్టాలనే ఆలోచన ఎప్పటినుండో ఉన్నా సరైన సమయం ఇప్పుడు వచ్చింది. తెలుగు భాషపై మమకారం తో "సృజన - సకల కళా సమ్మేళనం" పత్రికని ప్రారంభిస్తున్నాము. అందుకు మీ నుండి రచనలను ఆహ్వానిస్తున్నాము. తెలుగు భాషపై మమకారం కలిగిన ప్రతి ఒక్కరు తమ రచనలను పంపవచ్చు.

అంతే కాదుశీర్షికలు అలాగే వ్యాసాలతో పాటు వినోదాత్మక రచనలకు కూడా ఇక్కడ స్థానం కలదు. మీ యొక్క సృజనాత్మకతని పాఠకులతో తెలియచేసే అవకాశం ఈ పత్రిక కల్పిస్తుంది. ఉదాహరణకిమీరు గొప్ప చిత్రకారులు అయితే మీ చిత్రలేఖనాలను పంపవచ్చు. మీరు గాయకులు అయితే మీరు పాడిన పాట యొక్క youtube లింక్ మాకు పంపవచ్చు. మీరు నృత్యకళాకారులు అయితే మీ అరంగేట్రం నుండి ఇప్పటి వరకు మీరు అందుకున్న పురస్కారాల వివరాలు ఫొటోస్ తో సహా పంపించినట్లయితే ప్రచురిస్తాము. సకల కళా సమ్మేళనం ఈ సృజన పత్రిక.

మీ రచనలు feedbackattelugu(at)gmail.com కి మెయిల్ చెయ్యవలసిందిగా కోరుతున్నాము. మీ మెయిల్ లో స్పష్టం గా మీ రచన యొక్క విభాగం(కథశిర్షికవ్యాసం) తెలుపగలరు. ప్రస్తుతం పారితోషకం అందచేయలేము. 

అలాగేతెలుగుకి సంబంధించిన కార్యక్రమాల వివరాలు ముందుగా తెలియచేసినట్లయితే సంచిక లో ఆ వివరాలు కూడా తెలుపబడతాయి. 

త్వరలోనే ఈ పత్రిక అందంగా ముస్తాబయి మీ ముందుకు వస్తుంది.

ఇట్లు 
లాస్య రామకృష్ణ 
ఎడిటర్
 http://srujanapatrika.blogspot.in/ 
feedbackattelugu(at)gmail.com
Skype id - srujanamagazine

images courtesy google


No comments:

Post a Comment

పత్రికని మీ మెయిల్ ద్వారా పొందండి